calender_icon.png 20 November, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తేనే మాకు జీవితం

20-11-2025 12:00:00 AM

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాణంలో ఈ సినిమాను దర్శకుడు సంజీవ్‌రెడ్డి రూపొందించారు. బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీటీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “ప్రేక్షుకులు పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నా. మీరు థియేటర్లకు వెళ్తేనే మాలాంటి కొత్త హీరోలకు జీవితం ఉంటుంది” అన్నారు. ‘మా సినిమాను అంతా ఇష్టపడతారనుకున్నాం కానీ, ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేద’ని హీరోయిన్ చాందిని తెలిపింది. డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ..

‘ఏడాదిన్నర పాటు ఈ సినిమాకు పడిన కష్టం మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు’ అన్నారు. ‘మా సినిమాకు వస్తున్న స్పందనతో టీమ్ అంతా సంతోషంగా ఉన్నామ’ని నిర్మాత శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత హరిప్రసాద్‌రెడ్డి, ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్‌తోపాటు ఈ చిత్ర బృందం పాల్గొన్నారు.