calender_icon.png 18 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవే తప్పులు... సరిదిద్దుకునేదెప్పుడు ?

18-11-2025 12:00:00 AM

  1. స్పిన్ పిచ్‌లతో బోల్తా

తుది జట్టు ఎంపికలోనూ పొరపాట్లు

మితిమీరిన ప్రయోగాలు

గంభీర్‌పై విమర్శల వర్షం

కోల్‌కత్తా, నవంబర్ 17 : క్రికెట్‌లో విజయాలు సాధిస్తున్న ప్పుడు అంతా బాగానే ఉంటుం ది.. పరాజయాలు ఎదురవుతుంటే మాత్రం లోపాలన్నీ బయటపడుతుంటాయి. వరుస ఓటములకు కెప్టెన్, కోచ్‌లే బాధ్యత వహించాల్సి ఉం టుంది. అయితే భారత క్రికెట్ లో మాత్రం టెస్టుల్లో పేలవ ప్రదర్శనకు కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ద్రావిడ్ తర్వాత భారత హెడ్ కోచ్‌గా పగ్గాలు అందుకున్న గంభీర్ మాటే ఇప్పుడు శాసనంగా మారింది.

జట్టులో ఎవ రూ ఉండాలన్నా, ఎవరిని పంపించేయాలన్నా కూడా సెలక్టర్ల కంటే గంభీర్ మాటకే ప్రాధాన్యత ఉం టోంది. అలాంటప్పుడు పరాజయాలకు బాధ్యత వహించాల్సింది కూడా గంభీరే. తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టు లో భారత జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 124 పరుగుల టార్గె ట్‌ను ఛేదించలేక చేతులెత్తేసింది. ఈ ఓటమి తర్వాత హెడ్ కోచ్ గంభీర్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అతన్ని ఏకిపారేస్తున్నారు. అటు మా జీ ఆటగాళ్లు సైతం గంభీర్‌పై విమర్శలు గుప్పిస్తు న్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సక్సెస్ రికార్డ్ అందుకున్న గంభీర్ టెస్టుల్లో మాత్రం జట్టును నాశనం చేస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ ప్రదర్శన అ త్యంత పేలవంగా ఉంది. అతను కోచ్‌గా వచ్చిన తర్వా త ఇప్పటి వర కూ 18 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఏడింటిలో గెలిచి 9 టెస్టులు ఓడిపోగా, 2 డ్రాగా ముగిసాయి. వచ్చీరాగానే సీనియర్ ప్లేయర్స్‌ను పంపించేశాడన్న విమర్శలు ఉన్నాయి.

పొమ్మనకుండా అశ్విన్, కోహ్లీ, రోహిత్, పుజారా వంటి సీనియర్లకు గంభీరే పొగపెట్టాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. వీరి రీప్లేస్‌మెంట్స్‌గా పలువురు ప్లేయర్స్‌ను మారు స్తూ , బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇష్టానుసారంగా ప్రయోగాలు చేయడం భారత జట్టు లయ ను దెబ్బతీసాడన్నది చాలా మంది అభిప్రాయం. కేవలం అభిమానులే కాదు మాజీ లు సైతం గంభీర్‌పై ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఏ జట్టు బ్యాటింగ్ లైనప్‌లోనైనా మూడో స్థానం అత్యంత కీలకం. ఈ ప్లేస్‌పై గంభీర్ పదే పదే ప్రయోగాలు చేస్తుండడం చేటు చేస్తోంది.

పుజారా లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ ఆడిన మూడో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను పంపించడం గంభీర్ ప్రయోగాలకు పరాకాష్టగా చెబుతున్నారు. రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్స్‌ను వదిలేసి బౌలింగ్ ఆల్‌రౌండర్లను ఇలా పంపించడం సరైంది కాదన్నది మా జీల అభిప్రాయం. అలాగే పలు సందర్భాల్లో తుది జట్టు ఎంపికలోనూ గంభీర్ బేసిక్స్ మరిచిపోతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ దీనికి ఉదాహరణ. స్పిన్ పిచ్‌పై సాయి సుదర్శన్ లాంటి కీలక బ్యాటర్‌ను పక్కన పెట్టి నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం పెద్ద తప్పి దం.

ఈడెన్ పిచ్‌ను సరిగ్గా అంచనా వేసిన సౌతాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే.. గంభీర్ మాత్రం నలుగురు స్పిన్నర్లను తుది జట్టులో తీసుకోవడంపై మాజీలు తిట్టిపోస్తున్నారు. ఇక స్పిన్ పిచ్‌లపై పదే పదే మన బ్యాటర్లు బోల్తా పడుతున్నా మళ్లీ వాటికే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక లాజిక్ ఏంటో అర్థం కావ డం లేదు.

స్పోర్టింగ్ పిచ్ అంటూ వార్తలు వచ్చినా ఈడెన్‌లోనూ చివరికి స్పిన్ పిచ్‌నే ఎంచుకుని మరోసారి భారత్ బోల్తా కొట్టిం ది. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ పరాభవం నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదా అంటూ మాజీలు మండిపడుతున్నారు. పిచ్‌ల కంటే కూడా తుది జట్టు కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టి ఎక్కువ ప్రయోగాలకు పోవొద్దంటూ సూచిస్తున్నారు.

మంచి పిచ్‌లను ఎంచుకో

ఇకనైనా గంభీర్ మంచి పిచ్‌లు ఎంచుకోవాలి. బ్యాటర్లు 350 స్కోర్ చేయకుంటే భారత్ మ్యాచ్‌లు గెలవలేదు. ఇంగ్లాండ్ టూర్ లో మంచి స్కోర్లు చేసి మ్యాచ్‌లు గెలిచామన్న విషయం మరిచిపోవద్దు. టెస్ట్ మ్యాచ్‌లు 3 రోజుల్లో కాకుండా ఐదు రోజుల పాటు జరిగేలా పిచ్‌లను ఎంచుకుంటే గెలుపు అవకాశాలు ఉంటాయి. ఈ ఓటమి నుంచి భారత్ పుంజుకుంటుందని ఆశిస్తున్నా.

 సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్