28-10-2025 01:31:47 AM
కరీంనగర్, అక్టోబరు 27 (విజయ క్రాంతి): మంత్రులు.. మహిళా అధికారు లను ఇంటికి పిలిపించుకోవడం ఏమిటని, మహిళలను అవమానిస్తారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ తక్షణమే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించి ఆ మంత్రులను బర్తరఫ్ చేయాల్సిందేనని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రౌడీషీటర్లు పోలీసులపై హత్యాయత్నం చేస్తుంటే పట్టిం పు లేదా, పట్టపగలు గోరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారని అని బండి సంజయ్ ప్రశ్నిం చారు. తప్పు చేసిన రౌడీషీ టర్లకు ఎంఐఎం అండ ఉం టే వారికే వత్తాసు పలు కుతారా అని అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం నేతల కాళ్లు పట్టుకునే దుస్ధితిలో కాంగ్రెస్ నేతలున్నారని అన్నారు.
యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపాలని, రౌడీషీటర్లు బయటకు రావాలంటేనే గజగజ వణికేలా చేయాలని అన్నారు. నెలకు 2,500, తులం బంగారం, స్కూటీపై కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని మహిళలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్ర హంతో ఉన్నారని అన్నారు. సర్దార్ వల్లభా య్ పటేల్ 150 ఐక్యతా మార్చ్ కార్య క్రమాలను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సర్దార్ పటేల్ చరిత్ర తెలుసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు.