calender_icon.png 31 October, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల చదువుకై ప్రాణాలను లెక్కచేయని పంతులు

31-10-2025 12:39:58 AM

- పాఠశాలకు చెరెందుకు ప్రమాదకర స్థాయిలో వాగు దాటిన టీచర్. 

నాగర్ కర్నూల్ అక్టోబర్ 30 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ ప్రభుత్వ టీచర్ పాఠశాలకు చెరెందుకు ప్రమాదకరస్థాయిలో ఉన్న వా గు దాటి సాహసించాడు. తనని నమ్ముకుని పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఎ లాగైనా పాఠశాల చేరేందుకు ప్రమాదకర పరిస్థితు ల్లో వాగు దాటారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. రాజాపూర్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు పండిట్ దేవరపాగ ప్రభాకర్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు.

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపల్లి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో మారుమూల గ్రామాల మీదుగా చిన్నచిన్న వాగులు దాటుకుంటూ పాఠశాలకు చేరుకున్నాడు. మాచుపల్లి సింగాయపల్లి గ్రామాల మధ్యలో ఉన్నా వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా గ్రామస్థుల సహకారంతో వాగు దాటారు. దింతో ఉపాధ్యాయుడి నిబద్దత ను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షంవ్యక్తంచేశారు.