calender_icon.png 7 November, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవాలు వెలుగులోకి తెస్తే బెదిరింపులు

07-11-2025 01:02:23 AM

- మాభూమి జోలికి వస్తే వదిలేది లేదు

- విజయక్రాంతి రిపోర్టర్ కు ఓ సంఘం నాయకుని బెదిరింపు

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 6, (విజయ క్రాంతి):మా భూమి జోలికి వస్తే గతం లో సమాచార హక్కు చట్టం అర్జీదారునికి ప ట్టిన గతే పడుతుందని వాట్సాప్ కాల్ ద్వా రా నేరుగా విజయక్రాంతి రిపోర్టర్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారు ఓ కుల సం ఘం అధ్యక్షులు. చేసేది చట్టవిరుద్దమైన వ్య వహారం, అడ్డుకున్న అధికారులకు రాజకీయ ఒత్తిళ్లు, వాస్తవాలు వెలుగు చూపిన రిపోర్టర్ కు హెచ్చరికలు. ఈ తీరు కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో ని సోమలగూ డెం రెవెన్యూ పరిధిలో 61/2 సర్వే నంబర్లు 3.07 ఎకరాలు పోరంబోకు భూమి ఉంది. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే 1990 - 91 నుంచి 2000 - 01 పోరంబోకు భూమిగా నమోదయింది.

అట్టి భూమిని 2002 - 03 సంవత్సరంలో అప్పటి తాసిల్దార్ నిరుపేద గిరిజనుడైన మాలోత్ సామ్యకు జీవనోపాధి కోసం ఎస్త్స్రన్ మెంట్ పట్టా జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి అతనే పట్టాదారు, అనుభూధారి కాలంలో కొనసాగుతున్నాడు. అట్టి భూమిని 2017- 18 సంవత్సరంలో ఆ నాటి తాసిల్దార్ గిరిజనేతరుడైన బోధ రాం బాబు ను చట్ట విరుద్ధంగా అనుభవదారి కా లంలో నమోదు చేయడం గమనార్హం. ఇంతకాలం ఆ విషయం గోప్యంగా ఉంది. తా జాగా ఆ సర్వే నెంబర్ లోని ఎకరం భూమిని ఓ కుల సంఘం నాయకులు కొనుగోలు చే సి సంఘం కార్యాలయ నిర్మాణానికి పూనుకున్నారు. విషయం తెలిసి విజయక్రాంతి పత్రిక రెవెన్యూ తప్పిదాలను వెలుగులోకి తె స్తూ పత్రికలో ప్రచురించడం జరిగింది.

రెవెన్యూ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాజకీయ వత్తిళ్లకు పాల్పడినట్లు సమాచారం. 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. రెవెన్యూ అధికారులు చట్టాన్ని తుంగలో తొక్కి చట్టవిరుద్ధంగా గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల పేర్లను పహానిలో నమోదు చేసిన విషయా న్ని విజయక్రాంతి వెలుగు చూపిన పాపానికి సంఘం నాయకులు బెదిరింపులకు పాల్పడటం విడ్డూరంగా ఉంది. ఇంతమంది విలేకరులు ఉన్నా రాయని అంశాన్ని, నువ్వు కావాలనే రాస్తూ మా సంఘం కార్యాలన్నీ నిర్మించకుండా అడ్డుపడుతున్న అంటూ అ వాకులు చవాకులు పేలుతూ చివరకు గతం లో సమాచార చట్టం ద్వారా అక్రమాలను వెలుగులోకి తెస్తున్న అర్జీదారునికి పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరించడం గమనార్హం. 

ఆర్థిక బలం, రాజకీయ బలంతో ప్రభుత్వ భూములు ఆక్రమించిన, చట్ట వ్యతిరేకంగా క్రయవిక్రయాలు నిర్వహించిన, అక్రమ నిర్మాణాలు చేపట్టిన చోద్యం చూ స్తూ ఉండాలే తప్ప, ప్రశ్నించడం తప్పు అన్నట్లుగా ఉంది పాల్వంచలో కొందరి అక్రమ దారుల తీరు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమాలపై ఉదా సీనత విడనాడి వాటిని పై చర్యలు తీసుకోకు పోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూములు కనుజిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్వంచ పట్టణ, మండలంలో జరుగుతున్న చట్టవ్యతిరేక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.