calender_icon.png 8 August, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వారీలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

17-07-2024 12:04:04 PM

ఆత్మకూరు: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతులను తండ్రి రాజు(42) ఉష(12), శ్రీపాల్ రెడ్డి(44)గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఫంక్షన్ కోసం రెండు కుటుంబాలు సూర్యాపేటకు వెళ్లాయి. అక్కడి నుంచి కుటుంబసభ్యులు గ్రామ శివారులోని క్యారీ చూడటానికి  వెళ్లారు. మొదట క్వారీ గుంతలో ఉష, మరో బాలుడు ఈతకు దిగారు. నీట మునిగిన ఉషను కాపాడేందుకు తండ్రి రాజు, స్నేహితుడు శ్రీపాల్ రెడ్డి క్వారీలోకి దిగారు. ఈత రాకపోవడంతో మగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాలుడు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చాడు. రాజు హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.