calender_icon.png 18 November, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందీశ్వరుని అభిషేకంలో తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. వాణి

18-11-2025 12:00:00 AM

సూర్యాపేట, నవంబర్ 17 (విజయక్రాంతి) : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాస చివరి సోమవారం సందర్బంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డా. వాణి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా త్రికుటాలయంలో నందికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ముందుగా నామే శ్వర, ఎరకేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ చారిత్రక సంపదను కాపాడుకోల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ఆమెను దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి సన్మానించారు. ఆమె వెంట డిటివో లు జయ ప్రకాష్ రెడ్డి, లావణ్య ఎంవిఐలు కొండయ్య, ఆదిత్య, ఎఎంవిఐలు, సిబ్బంది ఉన్నారు.