calender_icon.png 30 August, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంపముంచిన ఫోన్ కాల్

30-08-2025 12:43:25 AM

పదవి కోల్పోయిన థాయ్ ప్రధాని

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఓ ఫోన్ కాల్ ప్రధాని పదవికి ఎసరు పెట్టింది. థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర పొరుగుదేశానికి చెందిన నేతకు చేసిన ఫోన్ కాల్ లీక్ అవడంతో ఆమెను దేశ రాజ్యాంగ న్యాయస్థానం ఇది వరకే ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా ఆమెపై అభియోగాలు రుజువు అయ్యాయని, ఇటువంటి వారికి ప్రధాని పదవిలో ఉండే అర్హత లేదని ఆమెను పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.

థాయిలాండ్ దేశానికి కాబోయే తదుపరి ప్రధాని ఎవరనే విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో అంకుల్ అంటూ థాయ్ ప్రధాని మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అయింది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించింది.

ఈ రెండు దేశాల నడుమ సరిహద్దు వివదాలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్రధాని పొరుగుదేశానికి చెందిన నేతతో మాట్లాడటం వివాదాస్పదమైంది. విచారణ జరిపిన న్యాయస్థానం మొదట షినవత్రను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించగా.. ఇప్పుడు ఏకంగా పదవి నుంచి తొలగించింది.