calender_icon.png 29 January, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ వశమే: మంత్రి జూపల్లి

29-01-2026 12:36:21 AM

మంచిర్యాల, జనవరి 28 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని ఎక్సైజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇంఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు దీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల కార్పొరేషన్, లక్షెట్టిపేట మున్సిపల్ ఎన్నికల గురించి బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో తన నివాసంలో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఫిబ్రవరి 11న జరుగబోయే ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్‌లోని 60 డివిజన్ స్థానాల్లో, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే మున్సిపాలిటీలు అభివృద్ది బాట పట్టాయని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు.