29-01-2026 12:22:01 AM
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పార్టీల్లో వార్డ్ కౌన్సిలర్ల ఎంపిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వం పరిశీలించాలని కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం పార్టీలో ఒక్కొక్క వార్డు నుంచి నలుగురు నుంచి ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీని నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజా సేవకు అంకితమైన తమ అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అగ్రనేతులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయా పార్టీల అగ్రోనితలు స్థానిక వార్డు రాజకీయ సమీకరణలు ఆర్థిక బలం జనం సర్వే ఎదుటి పార్టీల అభ్యర్థుల స్థితిగతులు అంచనా వేసుకుని ఎవరికీ ఎక్కడ టికెట్ ఇవ్వాలో నిర్ణయిస్తామని చెప్తున్నారు.
నిర్మల్, జనవరి 28 (విజయక్రాంతి): ‘ఇస్తే పార్టీ టికెట్ ఇవ్వండి లేదంటే మా దారి మే ము చూసుకుంటాం’ అంటూ నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో కొందరు సీనియర్ నేతలు అధిష్టానం పెద్దలపై తమదైన శైలిలో తీవ్రఒత్తిడి చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్‌లో 42 వార్డులు ఖానాపూర్‌లో 12 వార్డులు భైంసాలో 26 వార్డులు ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా ఆయా పార్టీల మద్దతు దారులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే రానిపక్షంలో రెబల్స్‌గా లేదా పార్టీ మారి టికెట్ సంపాదించిన ప్రయత్నాలు చేస్తున్నారు.
నిర్మల్ మున్సిపల్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించగా, బైంసా ఖానాపూర్ మున్సిపల్ స్థానాలు జనరల్ స్థానాలకు కేటాయించారు. ఈ మూడు మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలైన భారత రాష్ట్ర సమితి బిజెపి పార్టీ ఎంఐఎం పార్టీలతో పాటు జనసేన ఆమ్ ఆద్మీ పార్టీలు వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి
పాత, కొత్త తరం నేతల మధ్య పోటీ..
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి, ఎంఐఎం భారత రాష్ట్ర సమితి పార్టీలో కౌన్సిలర్ల ఆశావాదులు ఎక్కువగా ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో నిర్మల్ బైంసా ఖానాపూర్ గ్రూపులు ఉన్నాయి. పాత కొత్త కలయిక నేతల మధ్య టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. టికెట్ల కేటాయింపు విషయం లో డిసిసి అధ్యక్షులు బొజ్జు పటేల్ రేఖా షాప్ నాయక్, నిర్మల్‌లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీ శ్రీహరి రావు గ్రంథాలయ చైర్మన్ అర్జు మన్ అలీ మాజీ మున్సిపల్ చైర్మన్ చక్రవర్తి ఎవరికి వారి తన అనుచరుల కోసం టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ముధో ల్‌లో మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ వర్గీయులు పోటీ పడుతున్నా రు. ఇక బిజెపిలో మాత్రం నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి, ముధోల్‌లో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఖానాపూర్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ తదితరులు అభ్యర్థుల ఎంపిక లో కీలకం కానున్నారు.
అయితే నిర్మల్‌లో పాత కొత్త తరం నేతల మధ్య పోటీ నెలకొంది అయితే మహేశ్వర్‌రెడ్డికె అధిక ప్రాధాన్యత దక్కి అవకాశం ఉంది ముదులో రామారావు పటేల్ చెప్పిన వారికి టికెట్లు వస్తాయని ప్రచా రం జరుగుతుంది ఇక బీఆర్‌ఎస్‌లో పోటీ చేసే ఆశావాదులు తక్కువగా ఉండగా ఎదుటి పార్టీ లో టికెట్టు ఆశించి రానివారికి గులాబీ కండు వా వేసి పోటీ చేయించాలని పథకాన్ని రూపొంది స్తున్నారు. బైంసా నిర్మల్ మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీలో కూడా తీవ్ర పోటీ ఉంది. ఒక్కొక్క వార్డులు ఆశావాదుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారు టికెట్ కోసం లాభం నిర్వహిస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకుం టే పార్టీ మారుస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దీంతో పార్టీ అగ్రనేతల సైతం వారి పట్ల కఠినంగానే వివరిస్తూ .. ‘ఉంటే ఉండండి.. పోతే పొండి’ మీ రాజకీయ భవిష్యత్తు మీకు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఈనెల 30 గడువు ముగి యనుల నేపథ్యంలో పార్టీ టికెట్టు రాదని అం చనా వేస్తున్న కొందరు ఎదుటి పార్టీలో చేరి టికెట్టు దక్కించుకోవడం లేకుండా టిక్కట్టు నిరాకరిస్తున్న పార్టీ అభ్యర్థులను కూటమి చెందే విధంగా కుట్రలు పన్నుతున్నారని ప్రచా రం జరుగుతుంది. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో పార్టీ టికెట్లు ఆశించి బంగపడ్డ వారంతా పార్టీలు మారి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నా లు సాగిస్తున్నారు.
సమన్వయానికి సమయం తక్కువే
జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నిక లు రాజకీయ పార్టీలకు తలనొప్పి గానే మారినయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యం ఉన నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మక కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే ఆ పార్టీ నేతల ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్న నేతలు ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇప్పటికీ ఆయా మున్సిపాలిటీలో అగ్ర నేతలు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఆశావాదుల నుండి దరఖాస్తు స్వీకరించి ఎంపిక బాధ్యత పార్టీదని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అంద రూ కలిసి పని చేయాలని సూచించారు అయి తే అన్ని వార్డుల్లో ఆశావాదులు ఎక్కువగా ఉండటం నామినేషన్ల పక్కకు రెండు రోజులే కాడు ఉండడంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక సమన్వయం చేసుకునేందుకు పార్టీ నేతలకు సమయం దొరకక ఎవరికి ఎక్కడ టికె ట్లు ఇస్తే ఏ నష్టం జరుగుతుందన్న అంచనా తో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అన్ని మున్సిపాలిటీలో ఆశావాదులు ఇప్పటికే నామినేషన్ల దాకాలకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో తాజా మాజీ కౌన్సిలర్లు కొత్త అభ్యర్థులు మాజీ కౌన్సిలర్లు పలుకుబడి ఉన్న నేతలు వ్యాపారవేత్తలు విద్యావంతులు ఉండడంతో అందరి చేత మొదలు నామినేషన్ వేయాలని తర్వాత బి ఫాం ఎవరికి పార్టీ ఇస్తే వారే పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ ముఖ్య నేతలు సూచించారు.
రెబల్స్ అభ్యర్థిగా పోటీలో..
ఈనెల 30 వరకు నామినేషన్లు మూడు వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో అప్పటివరకు అన్ని మూసి పార్టీలో అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు నామినేషన్ వేసిన వారితో చర్చలు జరిపి సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం నచ్చకపోతే వారు రెబల్స్ అభ్యర్థిగా పోటీలో దిగే అవకాశం ఉన్నందున అది పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఆశావాదులు నామినేషన్లను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. నామినేషన్ వేస్తే ఎదుటి పార్టీలు నామినేషన్ల ఉపసంహరణకు రాయబారాలు నడిపే అవకాశం ఉన్నందున నగదు ఇతర ప్రలోభాలకు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలో సమన్వయం ఏ మేరకు సయోధ్య కుదురుస్తుందో కాలమే వేచి చూడాలి.