calender_icon.png 29 January, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి

29-01-2026 12:37:38 AM

నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ 

మంచిర్యాల, జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్, కలెక్టరేట్ ఏఓ పిన్న రాజేశ్వర్ లతో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచా యతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన అనుభవంతో మున్సిపల్ ఎన్నికల నిర్వ హణ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని, ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన వారిని అనుమతించడం జరగదన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (08736-250501) ఏర్పాటు చేశామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులకు సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 

నామినేషన్ల ప్రక్రియ పరిశీలన

బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం బెల్లంపల్లిమున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ జె.సంపత్ తో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు.