29-01-2026 12:07:58 AM
మొదలైన నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓట్ల జాతర
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో పురపోరుకు కోలాహలం మొదలైంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్వీ పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లకు గడువు విధించారు.
నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం పట్టణంలో 29 డివిజన్లకు గాను 11 రూములను ఏర్పాటు చేశారు. 10 ,11, 12 డివిజనులకు రూమ్ నెంబర్ 1, 13, 14, 15, డివిజన్లకు రూమ్ నెంబర్ 2, 16, 17 డివిజన్లకు రూమ్ నెంబర్ 3, 18 ,19 డివిజన్లకు రూమ్ నెంబర్ 4, 24, 25 ,26 డివిజన్లకు రూమ్ నెంబర్ 5, 27, 28 డివిజన్లకు రూమ్ నెంబర్ 6, 29, 30 డివిజనులకు రూమ్ నెంబర్ 7, 49,50, 51 డివిజన్లకు రూమ్ నెంబర్ 8, 52, 53, 54, డివిజన్లకు రూమ్ నెంబర్ 9, 55, 56, 57 డివిజన్లకు రూమ్ నెంబర్ 10, 58, 59, 60 డివిజనులకు రూమ్ నెంబర్ 11ను కేటాయించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని 27 డివిజన్లో గాను 9 రూములను ఏర్పాటు చేశారు.
1.2,3 డివిజన్లో 1వ రూమ్ లో, 4,5,6 డివిజన్లో 2వ రూమ్ లో, 3వ రూమ్ లో 7, 8 ,9 డివిజన్లు. 31 ,32, 33 డివిజన్లు 13 వ రూములో, 34 35 36 డివిజన్ లు 14వ నెంబర్ రూములో, 37 38 39 డివిజన్ లు 15 నెంబర్ రూములో, 40,41 ,42 డివిజన్ లు 16వ నెంబర్ రూము, 43, 44, 45 డివిజన్ లు 17వ నెంబర్ రూము, 46 47 48 డివిజన్లు 18వ నెంబర్ రూములో నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పత్రాల జారీకి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు అయిన అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కార్యాలయంలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద నామినేషన్లను వేసేందుకు ఏర్పాటులు పూర్తి చేశారు. 22 మంది రిటర్నింగ్ అధికారులను ఉన్నతాధికారులు నియమించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అవసరమైన పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచే నామినేషన్ల కేంద్రాల వద్ద ఆశావాహులు గుంపులు గుంపులుగా చేరి నామినే షన్ పత్రాలను తీసుకుంటున్నారు.
ఇల్లందు..
ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులకు నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు.
కార్పొరేషన్ లో 1,34,775 మంది ఓటర్లు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లలో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారని. 60 డివిజన్లలో 65 లొకేషన్స్ 201 పోలింగ్ కేంద్రాలనుగుర్తించామన్నారు. సుజాతనగర్ 4 డివిజన్లకు సంబంధించి గ్రామాలు ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1050 ఓట్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం.
డిస్ట్రిబ్యూషన్ కౌంటర్, కౌంటింగ్ కేంద్రంగా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలను నిర్ణయించామన్నారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
- మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత