calender_icon.png 29 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడితో పెళ్లి వద్దన్నారని తల్లిదండ్రులను చంపేసింది

29-01-2026 12:29:34 AM

  1. ఓవర్ డోస్ మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కూతురు 
  2. కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని ఘాతకం 
  3. వికారాబాద్ జిల్లా యాచారంలో ఘటన

వికారాబాద్, జనవరి -28 (విజయక్రాంతి): తల్లిదండ్రులు తన కులాంతర ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని, వారికి నొప్పుల ఇంజక్షన్ అని నమ్మబలికిన కూతురు ఓవర్ డోస్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఈ నెల 24న జరిగగా.. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాచారం గ్రామానికి చెందిన నక్కలి లక్ష్మి, దశరథ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నాడు.

వీరిలో ముగ్గురికి వివాహం కాగా చిన్న కూతురైన సురేఖకు వివాహం కాలేదు. ఆమె బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నది. సంవత్సరం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి సురేఖ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య గొడవ జరిగింది. అయినప్పటికీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారిని హత్య చేసైనా పెండ్లి చేసుకోవాలని ఉద్దేశంతో సురేఖ పథకం పన్నింది.

ఆమె పనిచేస్తున్న హాస్పిటల్‌లో రోగులకు ఎమర్జెన్సీలో ఇవ్వడానికి పెట్టిన మత్తు ఇంజక్షన్లు అట్రాక్యు రియం 2.5 ఎంఎల్ నాలుగు బాటిల్లను దొంగలించింది. ఈ నెల 24న ఆసుపత్రిలో వారాంతపు సెలవు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాప్‌లో మూడు సిరంజిలు తీసుకుని యాచా రానికి వచ్చింది. సాయంత్రం పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. భోజనం అనంతరం కూడా తన ప్రేమ పెండ్లి గురించి అడగగా వారు ఒప్పుకోలేదు.

దీంతో పథకం ప్రకారం తన తల్లి లక్ష్మికి ఒళ్లు నొప్పులు తక్కువ కావడానికి మందు తెచ్చానని రాత్రి పది గంటల సమయంలో ఐవీ ఇంజక్షన్ 5 ఎంఎల్ అధిక మోతాదులో ఇవ్వడంతో ఆమె కుప్పకూలిపోయిం ది. తల్లిని నిద్రపోతున్నట్లుగా పడుకోబెట్టింది. అనంతరం బయట నుంచి చలిమం ట కాచుకొని వచ్చిన తండ్రికి అమ్మ పడుకుందని చెప్పి, ‘నీకు కూడా ఒళ్లు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చా’నని చెప్పి అతనికి కూడా 5 ఎంఎల్ మోతాదులో ఇంజక్ష న్ ఇచ్చింది. దీంతో తండ్రి కూడా మృతిచెందాడు.

సహజ మరణాలుగా చిత్రీకరించేం దుకు తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి చనిపోయారని తెలిపింది. అశోక్ ఈనెల 25 ఉద యం తన తండ్రి అప్పుల బాధతో గుర్తు తెలియని విషం తాగి మృతిచెందాడని, అది చూసిన తన తల్లి షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటపడిం ది. తన పెళ్లికి అడ్డు చెప్పినందునే తల్లిదండ్రులను చంపినట్లు సురేఖ అంగీకరించి నట్లు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. నిందితురాలు నుంచి సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు.