calender_icon.png 29 January, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం

29-01-2026 12:26:30 AM

  1.   13 మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులను నిలబెడతాం
  2. మాది సామాన్యుల పార్టీ
  3. టీఆర్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి అశోక్ ముదిరాజ్
  4. మ్యానిఫేస్టోను విడుదల చేసిన నాయకులు

హనుమకొండ, జనవరి 28 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సామాన్యుల పార్టీ అని, 75 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గా ల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు.

పార్టీ గుర్తు ‘కత్తెర’కు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎల్లబోయిన ఓదెలు పార్టీ విధి విధానాలు వివరించి అనంతరం మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ప్రజలకు పారదర్శకమైన అవినీతి లేని పాలన అందించడం,గ్రామ పంచాయతీల తరహాలోనే వార్డు నిధులను నేరుగా వార్డు అభివృద్ధికి కేటాయించడం, మహిళలరక్షణకు అత్యంత ప్రాధా న్యతనిస్తూ, నగర భద్రతను మెరుగుపరచడం, ‘ఓటు మీది - పాలన మాది’ అనే నినాదంతో, ప్రజల అవసరాల తీర్చే విధంగా 10 ముఖ్యమైన అంశాలతో మ్యానిఫెస్టోను రూపొందిం చినట్లు టీఆర్పీ నేతలు పేర్కొన్నారు.

కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తి ని వెంకటేష్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెండెల సంపత్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవిపటేల్, జనగాం జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ జిట్టబోయి నరేష్ ముదిరాజ్, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కట్ల రాజేష్, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణ,హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గి రాజు, ఉపాధ్యక్షులు ముడిదే శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి,ట్రై సిటీ ప్రెసిడెంట్ మల్లికార్జున శాస్త్రి మరియు పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.