27-11-2024 12:44:57 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఏకో బ్రిడ్జి సమీపంలో మంగళవారం వాహనదారులకు పులి కనిపించడంతో భయాందోళనకు గుర య్యారు. గత మూడు రోజులుగా వాంకిడి సమీపంలో పులి సంచరిస్తున్నట్లు ప్రజలు గమనించారు.
రెండు రోజుల క్రితం పశువుల మందపై దాడి చేసి గాయపరిచిన పులి.. మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు భావించారు. పులి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిర్మల్ జిల్లా గ్రామాల్లోనే సంచరిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.