calender_icon.png 10 August, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

25-01-2025 12:08:03 AM

ఈవో శ్రీనివాసరావు

నాగర్ కర్నూల్ జనవరి 24 :మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ఇతర ప్రాంతా ల్లోని భక్తులు కూడా శ్రీశైల మహా క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో కట్టు దిట్టమైన భద్రత, సౌక ర్యాలు ఏర్పాట్లను కల్పిస్తున్నట్లు శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

19 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి వరకు కొనసాగనున్నాయని ఈ నేపథ్యంలో శివమాలలు ధరించిన భక్తులతో పాటు అశేషంగా శ్రీశైల క్షేత్రానికి భక్తులు తరలి రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. శుక్రవారం  సంబంధిత అధికారులతో కలిసి పాతాళ గంగ, దేవస్థానం డార్మిటరీలు, కల్యాణ కట్ట, శివదీక్షా శిబిరాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, మల్లికార్జున భవన్ తదితర ప్రదేశాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

పాతాళ గంగకు వెళ్ళే మెట్ల మార్గంలో మెట్లకు మరమ్మతులు చేసి అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. బ్యారికేడింగ్, జల్లుస్నానాలు (షవర్బాత్), మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మరుగు దొడ్లను సిద్ధం చేశామన్నారు. పోలీస్ అధి కారుల సమన్వయంతో ఆయా భద్రతా చర్యలు చేపట్టాలని భద్రదతా విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు. పాతాళగంగ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.

అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పాతాళ గంగ లో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చా లన్నారు. భక్తులకు అవగాహన కలిగేందుకు పాతాళగంగలో మరిన్ని హెచ్చరికబోర్డులు, సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

శివదీక్షా శిబిరాల్లో గతం కంటే ఎక్కువ విస్తీర్ణములో పైపె పెండాల్స్ వేయాలన్నారు. వారి వెంట ఈఈ  పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, ఏఈఓ  బి.మల్లికార్జున రెడ్డి, పిఆర్‌ఓ టి. శ్రీనివాసరావు, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు డి. రాధాకృష్ణ, భద్రతా విభాగపు పర్యవేక్షకులు సి. మధుసూదన్రెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.