calender_icon.png 22 September, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ నగర్ సీఐఎస్‌ఎఫ్ రహదారి పునరుద్ధరణ

22-09-2025 12:02:53 AM

రామచంద్రపురం, సెప్టెంబర్ 21:తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్ ఎంఐజి నుండి సిఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్ వరకు ఎన్నో ఏళ్లుగా గుంతలతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన రహదారికి మరమ్మతు నిర్వ హించారు. సొంత నిధులతో మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు లచ్చి రాం, బాబ్జి ముందడుగు వేసి పనులు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజ లు, బిహెచ్‌ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

గర్భిణులు, వృ ద్ధులు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ మహిళలు ప్రత్యేకంగా నా యకులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ సర్పంచ్ సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బిహెచ్‌ఎల్ యాజమాన్యాన్ని కోరి నా ఫలితం లేకపోయిందని,

చివరకు ప్రత్యేక సమావేశం నిర్వహించి రోడ్డు పనులకు అం గీకారం తెచ్చి పనులు చేయించినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ లచ్చిరాం మాట్లాడు తూ మరమ్మతు పనికి ఎంఐజి కాలనీవాసులు, బిహెచ్‌ఎల్ యాజమాన్యం, ఉద్యోగు లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, బిహెచ్‌ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది పాల్గొన్నారు.