01-10-2025 02:13:48 AM
డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): భారతదేశంలోని గుండె శస్త్రవైద్యులపై డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథోరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, చైర్మన్, సజ్జ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సర్వే ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ థోరాసిక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ’ 2025 అక్టోబర్ సంచికలో ప్రచురించబడింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ‘అక్యూట్ టైప్-ఎ ఏఆర్టిక్ డిసెక్షన్’ చికిత్స అందించడంలో గణనీయమైన తేడాలు ఉన్నట్లు వెల్లడించింది.
‘ప్రత్యేక కార్డియాక్ కేంద్రాలలో సకాలంలో శస్త్రచికిత్స చేయడం ప్రాణాలను కాపాడుతుంది. ‘ఏవోర్టిక్ డిసెక్షన్’ అనేది చాలా అరుదుగా వచ్చే, ప్రాణాంతకమైన పరిస్థితి. దీనిలో గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్ళే ప్రధాన రక్తనాళం అయిన బృహద్ధమనిలో చీలిక ఏర్పడుతుంది. ఈ చీలిక వేగంగా వ్యాపిస్తుంది. చికిత్స చేయకపోతే, కొన్ని గంటల్లోనే ప్రాణాంతకం కావ చ్చు.
చికిత్స చేయకుండా వదిలేస్తే, మరణ ప్రమాదం ప్రతి గంటకు 12% పెరుగుతుందని పరిశోధనలు చెపుతున్నా యి. భారతదేశంలో తాజా నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం లక్ష మందిలో 56 కేసులు సంభవిస్తున్నాయి. అధిక రక్తపోటు అతిపెద్ద ప్రమాద కారకం. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల పురుషులు ఎక్కువగా ప్రభావితమవుతారు. మార్ఫాన్ సిండ్రోమ్ లేదా బైకస్పిడ్ ఏవోర్టిక్ వాల్వ్ వంటి జన్యుపరమైన సమస్యలు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అకస్మాత్తుగా వచ్చే ఛాతి నొప్పి, తీవ్రమైన వెన్ను నొప్పి, మూర్ఛ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాలను రక్షించడానికి ప్రజలలో అవగాహన మరియు వైద్యులు సకాలంలో గుర్తించడం చాలా అవసరం. అక్యూట్ టైప్ ఏ ఏవోర్టిక్ డిసెక్షన్ కోసం శస్త్రచికిత్స మాత్ర మే నిరూపితమైన చికిత్స. అత్యవసర శస్త్రచికిత్సలో చీలిక ఏర్పడిన బృహద్ధమని భాగా న్ని కృత్రిమ గ్రాఫ్ట్‌తో భర్తీ చేస్తారు.
తద్వారా చీలిక లేదా గుండె వైఫల్యాన్ని నివారిస్తారు. ది ఫ్రోజెన్ ఎలిఫెంట్ ట్రంక్ గతంలో శస్త్రచికిత్సలు కేవలం పైభాగంలో ఉన్న బృహద్ధమనిని భర్తీ చేయడంపై మాత్రమే దృష్టి సారించాయి. నేడు, ఫ్రోజెన్ ఎలిఫెంట్ ట్రంక్ విధానం వంటి కొత్త పద్ధతులు ఓపెన్ సర్జరీని స్టెంట్ గ్రాఫ్ట్తో కలుపుతాయి.
గుండెపోటు లేదా పక్షవాతం లాగా ఏవోర్టిక్ డిసెక్షన్ గురించి జనాలకి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఇది కూడా చాల ప్రమాద కరం. ఈ పరిస్థితిపై అవగాహన, లక్షణాలను త్వరగా గుర్తించడం, కార్డియాక్ సర్జరీ కేంద్రానికి తక్షణమే చేరుకోవడం వలన ప్రాణా లను కాపాడవచ్చు అని డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ అన్నారు.