calender_icon.png 29 August, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచేలా మోడల్ డెమో ఫామ్

29-08-2025 03:08:03 AM

బూర్గంపాడు, ఆగస్టు28,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రజలకు అదనపు ఆదాయం మరియు ఉపాధి అవకాశాలు పెంచేలా మోడల్ డెమో ఫామ్ ను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలోని సీతారామ కాలువ పక్కన ఉన్న నీటిపారుదల శాఖ భూమిలో నూతనంగా ఏర్పాటు చేయు మోడల్ డెమో ఫామ్ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ డెమో ఫామ్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ డెమో ఫామ్ లో కూరగాయల సాగు, మట్టితో ఇటుకల తయారీ యూనిట్, వెదురు మరియు వాక్కాయ కంచె, క్వాయిల్ యూనిట్ షెడ్ మరియు సోలార్ డ్రైవర్ ఏర్పాటు చేయడంతో పాటు మునగ చెట్లు పెంచే విధంగా ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ మోడల్ డెమో ఫామ్ ద్వారా రైతులకు మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కలగడం, సరికొత్త వ్యవసాయ పద్ధతులు పరిచయం కావడం ద్వారా అదనపు ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఆర్‌ఐ నరసింహారావు, ఎస్సార్‌ఎల్పి ఏఈ సందీప్, ఎంపీఓ బాలయ్య, ఏపీఓ విజయలక్ష్మి,ఏవో శంకర్, ఏపీఎం హేమంతిని, పంచాయతీ సెక్రెటరీ భవాని తదితరులు పాల్గొన్నారు.