calender_icon.png 29 August, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

29-08-2025 03:06:20 AM

 జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల కీలక సూచన.

ఖమ్మం, ఆగస్ట్ 28 (విజయ క్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులో ఉన్న మంత్రి తుమ్మల జిల్లా అధికారులకు ఫోన్ చేసి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలని వాగులు, కల్వట్లపై నీటి ప్రవాహం ఉంటే రాకపోకలు నిషేధించాలని, చెరువులు కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నం దున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.

వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజల ప్రాణ, ఆస్తులను కాపాడాలని మంత్రి తెలిపారు. అలాగే జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షాల్లో అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని సూసించారు.