calender_icon.png 22 January, 2026 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతి లడ్డూ కల్తీ దారుణం

25-09-2024 02:37:31 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): తిరుపతి లడ్డూ కల్తీ కావడం దారుణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. నగరంలోని హిమాయత్‌నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. త్వరగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.