05-05-2025 12:52:12 AM
మహబూబ్ నగర్ మే 4 (విజయ క్రాంతి) : క్రీడల్లో ప్రతి విద్యార్థి రాణించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఖలీల్ చౌక్ ప్రీమియర్ లీగ్ అండర్ 20 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మాజీ మం త్రి శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు తల్లితండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని, యువత చదు వుకొని ఉపాధి పొంది తల్లితండ్రులను బాగా చూసుకోవాలన్నారు.
యువత ఇక్కడే చదు వుకొని ఉపాధి పొందేందుకు పరిశ్రమలను తీసుకువచ్చామని పేర్కొన్నారు. బీసీ, మైనారిటీ, ఎస్సి విద్యార్థులు చదువుకోసం ఎక్కువ పాఠశాలలు. కళాశాలలు తీసుకువచ్చామని తెలియ జేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధి లో యువత భాగస్వాములు కావాలని, క్రీడల్లో రాణిం చేందుకు తమ హయాంలో యువతకు క్రీడ కిట్లు అందజేసినట్టు చెప్పారు. గ్రామాల్లో మైదా నాల అభివృద్ధి తో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.
ఇండోర్ స్టడియం ల నిర్మాణంతో పాటు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమం లో ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పార్టీ నాయకులూ మోసిన్ ఖాన్, ఇమ్రాన్, నవకాంత్, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి,రామకృష్ణ, నిర్వాహకులు జుబైర్, మజహర్, షాకీర్, షాబాజ్ తదితరులు పాల్గొన్నారు.