calender_icon.png 6 May, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రశాంతంగా నీట్ పరీక్ష

05-05-2025 12:53:50 AM

గద్వాల, మే 04 ( విజయ క్రాంతి ) : జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్ యూజీ-2025’ పరీక్ష ఆదివారం జి ల్లాలో ప్రశాం తంగా ముగిసిం దని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు. ఆదివా రం జిల్లా కేంద్రం లోని ప్రభు త్వ బాలుర పాఠశా ల,ప్రభు త్వ బాలికల పాఠశా ల,ప్రభు త్వ జూనియర్ కళాశా లలో ఏర్పాటు చేసిన నీట్ పరీ క్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ బి.యం.సంతోష్ ఆకస్మికంగా తని ఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నీట్ పరీక్ష నిర్వహణ విధానం,విద్యార్థుల హాజరు వివ రాలను అధికారుల నుండి తెలుసుకున్నారు.పరీక్ష నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీ లించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు.పరీక్షా కేం ద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫో న్లను అనుమతించరాదని అన్నారు.

ఎలాంటి మాల్ప్రాక్టీస్కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు తాగునీరు అందుబా టులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు.

జిల్లాలో మొత్తం 1,029 మం దిలో 1,005 మంది అభ్యర్థులు పరీక్షకు హాజర య్యారు,24 మంది గైర్హాజరయ్యారని తెలిపా రు. జిల్లాలో 03 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష శాంతియుత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించబడిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వెంకటేష్, ప్రిన్సిపాల్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.