calender_icon.png 26 August, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కాళోజీ వర్ధంతి

13-11-2024 12:00:00 AM

కాళోజీ....

ఓరుగల్లు వజ్రం 

భరతమాత రత్నం 

మన తెలంగాణ ముత్యం

మనకతడే పూజ్యం 


కాళోజీ ....

పేరు నారాయణుడు 

శ్రమ జీవుల దేవుడు 

అవినీతికి యముడు 

సమత మమత ప్రేమికుడు 


కాళోజీ...

సదా వెలుగుతున్న రవి 

గొడవతో ముడి పడిన పవి 

చెడు తలపులకు కొరివి 

మంచి పెంచి చేరుకునె దివి 

కాళోజీ....

తెలంగాణే తనకు మడి

యాస భాషే పలుకు బడి 

అక్షరాలతోనే అలజడి 

గుబులు రేపిన పద నుడి


కాళోజీ....

ప్రజల మేలునకై నీ ఆవేదన 

నిదురెరుగని నీ శోధన 

తెలంగాణ రాష్ట్రమే నీ స్థాపన 

నిలిచి గెలిచె నీ తపన 


కాళోజీ.....

నిను తలతుము అనుదినము 

నీ బాటే మాకు పథము 

నీ మాటే మాకు హితము 

హృది నిండా స్మరింతుము. 

- నమిలకొండ నాగేశ్వర్ రావుసెల్: 86885 53470