08-09-2025 12:28:06 AM
నేడు ప్రజా వేదిక
సిర్పూర్ యు, సెప్టెంబర్7(విజయక్రాంతి ) :మండలంలో 2024 సంవత్సరంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ ద్వారా సుమారు రూ. 5.99 కోట్ల నిధులతో వివిధ పనులు నిర్వహించారు.దీని పై గత వారం రోజులు గా సామాజిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.శని, ఆదివారం గ్రామాలలో గ్రామస భలు నిర్వహించారు.
నేడు (సోమవారం) మండల స్థాయిలో ప్రజా వేదిక నిర్వహించనునారు. కాగా తనిఖీలో అనేక విషయాలు బయటకు వచ్చాయి.మండలంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులలో రూ. 3.38 కోట్లతో లేబర్ పేమెంట్ పనులు నిర్వహించగా రూ.2.61 కోట్లతో మెటీరియల్ పను లైనా సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనా లు, అంగన్వాడీ భవనాలు నిర్వహించారు.
మండలంలో నిర్వహించిన మెటీరియల్ పేమెంట్ సంబందించిన రికార్డులను అధికారులు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వక పోవడంతో వీటిపై సామాజిక తనిఖీ బృం దం ఇలాంటి తనిఖీ నిర్వహించలేదు.కాగా అధికారులు రికార్డులు అంచకపోవడం పట్ల ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయి.
సుమారు 2.61 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన పనులకు చెందిన రికార్డులుఇవ్వక పోవడం వలన అధికారులకు, కాంటాక్టర్లకు సత్సంబంధాలు ఉన్నాయేమో తనిఖీ చేయ డం వలన అసలు విషయం బయట పడడ మే కాకుండా రికవరీ చేయవలసి వస్తుందనే రికార్డులు ఇవ్వలేదేమో అని ప్రజలు అంటున్నారు.
వీటిపై సామజిక తనిఖీ చేయకపోవ డం వలన పది శాతం నిధుల కోత విధించ డం జరుగుతుందన్ని తెలిసినపటికి సామజిక తనిఖీ చేయించక పోవడంతో అప్పటికే కాంటాక్టర్లు లాభాలలో ఉన్నారనే విషయం అర్థం అవుతుంది.
టీఏల చేతివాటం-..
మండలంలో 3.38 కోట్లతో ఉపాధి పను లు నిర్వహించారు. ఇందులో మట్టి కట్టాలు, ఇంకుడు గుంతలు, కాలువలు లాంటి పను లు చేయించారు.అయితే అనేక చోట్ల చేసిన పనులు కనిపించడం లేదు. రికార్డులు సక్రమంగా లేవు. కొలతలలో పొంతన ఉండడం లేదు. ఈ విషయం టీఏలను అడిగినప్పుడు వర్షం వచ్చింది. తవ్విన కాందకాలు మట్టితో నిండిపోయాయి. రైతులు నాగల్లతో దునడం తో కనిపించడం లేదు.
చెట్లు, పోదాలు పెరగడం వలన కొలతలు సక్రమంగా చూపించక పోతున్నం అని సమాదానం చెబుతున్నారు. కానీ తనిఖీ బృందం మాత్రం సర్దుబాటు చేస్తున్నారే తప్ప తవ్వకాలు మూసుకోపో యాయి సరే వాటి ఫొటోలు ఇవ్వండి అని కూడా అడగడం లేదు.
పనుల వద్ద ఒక నేమ్ బోర్డు కనిపించడం లేదు. పనుల వివరాల పట్టిక లేదు. మాస్టర్లలలో అనేక తప్పిద్దాలు ఉన్నట్లు తనిఖీలో తేలాయి. ఇంత జరుగుతున్నపటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసు కుంటారో అనే ఆంశం ఆశక్తిగా మారింది. రికార్డులు ఇచ్చాం:కృష్ణ రావు, ఎంపీడీవో అందుబాటులో ఉన్న రికార్డులు ఇచ్చాం మిగితా పని వారే చేసుకోవాలి. మిగితా విషయాలు ప్రజావేదికలో తెలుస్తాయి.