calender_icon.png 10 September, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి

10-09-2025 01:17:47 AM

  1. ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్ కోసం రూ.10 లక్షలు డిమాండ్

రూ.4 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ మణిహారిక 

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘటన 

మణికొండ, సెప్టెంబర్ 9: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారికి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడింది. మంచిరేవుల ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్‌కు సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) క్లియరెన్స్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారికను సంప్రదించాడు. ఫైల్ క్లియర్ చేయ డానికి ఆమె ఏకంగా రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసింది.

లంచం ఇవ్వనిదే పని జరగదని తేలడంతో వినోద్ ఏసీబీ అధికారు లను ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు అంగీకరించిన లంచంలో మొదటి విడతగా రూ.4 లక్షలను మంగళవారం మణిహారికకు కార్యాలయంలోనే ఇస్తుండగా ఏసీబీ అధికారులు మణిహారికను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.