03-01-2026 12:00:00 AM
మొయినాబాద్, జనవరి 2 (విజయ క్రాంతి): నూతన సంవత్సరం పురస్కరించుకొని శుక్రవారం నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి, నక్కలపల్లి వాసి గౌరీ సతీష్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మంచి ఆలోచనలతో జీవితాలను మార్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధినే ధ్యేయంగా తీసుకుని పని చేయాలని సూచించారు. నక్కలపల్లి గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.