calender_icon.png 25 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన భద్రతలో ట్రాఫిక్, మానవ తప్పిదాలే ముఖ్య సమస్యలు

11-02-2025 12:00:00 AM

ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక అధికారి డాక్టర్ ఎం.వి. సత్యానంద్

పటాన్‌చెరు, ఫిబ్రవరి 10 : విమానయాన భద్రతలో పెరుగుతున్న విమాన ట్రాఫిక్, మానవ తప్పిదాలు, ప్రమాదాల ప్రాబల్యం వంటి ముఖ్యమైన సమస్యలు కీలక భూమిక పోషిస్తున్నా యని, వాటిని అధిగమించేలా మనం సాంకేతికను అభివృద్ధి చేసుకోవాలని ఐఐటీ హైదరా బాదులోని టిహాన్ లో విశిష్ట సాంకేతిక అధికారి డాక్టర్ వెంకట సత్యానంద్ ముట్నూరి అన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చరల్ సిస్టమ్ హెల్త్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ డ్ ఎయిర్ మొబిలిటీ’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. తక్కువ, అధిక ఎత్తులో ఉన్న ఎయిర్ స్పేస్ ఆపరేషన్ లకు సంబంధించిన డయాగ్నస్టిక్స్, ప్రోగ్నో స్టిక్స్ పద్ధతులపై విలువైన అంతర్దృష్టులను అదించారు.

ఆయా సవాళ్లను అధిగమించడానికి వినూత్న పరిష్కారాల అవసరాన్ని ఆయన వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చరల్ హెల్త్ మేనేజ్మెంట్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ హెల్త్ మేనేజ్మెంట్, ఎయిర్ ట్రాఫిక్, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, అడ్వాన్స్ డ్ ఎయిర్ మొబిలిటీ వంటి కీలక రంగాలను డాక్టర్ ముట్నూరి విశదీకరించారు.

అత్యంత సరళేతర విమానాల అప్సెట్ ప్రవర్తనను సంగ్రహించడం, నిజ సమజంలో ప్రమాద ప్రాంతాలను అంచనా వేయడం వంటి సమర్థవంతమైన ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణకు చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.

విజయవాడలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు, అందులో డ్రోన్లు పోషించిన పాత్ర, వాటి విజయాలు, పరిమితులు, స్వయం ప్రతిపత్తి సాంకేతికతల ప్రభావాన్ని ప్రదర్శించడం వంటి ఆకర్షణీయమైన కేస్ స్టడీలను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ అక్తర్ ఖాన్,  డాక్టర్ నికుల్ జాని, మాజీ విభాగాధిపతి డాక్టర్ వి.హిమబిందు తదితరులు పాల్గొన్నారు.