calender_icon.png 25 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

11-02-2025 12:00:00 AM

నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి

కొల్చారం, ఫిబ్రవరి 10: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మండల కేంద్రమైన కొల్చారం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధన చేయాలన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూతులు పరిశీలించారు. ఆయన వెంట తహసిల్దార్ గఫర్ మియా, పాఠశాల ప్రధానోపాధ్యా యులు శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.