calender_icon.png 11 May, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాతన్ పల్లి పై వంతెనపై మొదలైన రాకపోకలు

15-04-2025 08:27:16 PM

ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యేలు..

ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది...

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి...

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి కాగా మంగళవారం నుంచి రాకపోకలు మొదలయ్యాయి. క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాలనాధికారి కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీ, క్యాతన్ పల్లి పుర ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరిందన్నారు. భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, గుత్తేదారుడుకి ఇవ్వాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కొంత ఆలస్యమైందని అన్నారు.

త్వరలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు వెచ్చించి రోడ్లు, డ్రెయినేజీలు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు. నియోజక వర్గంలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, రెండు వందల కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో ఓ నూతన ఒరవడితో విద్యాలయాన్ని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల రూపాయల రుణాలను త్వరలోనే మంజూరు చేస్తానని, ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

విద్య, వైద్యానికి పెద్ద పీఠ..  -ఎంపీ వంశీ కృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్ద పీఠ వేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నిలిపివేసిన అజ్ని ప్యాసింజర్ రైలును మరల పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణిలో 'కాకా' వెంకటస్వామి మొదలు పెట్టిన పెన్షన్ స్కీంను పది వెలకు పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.