20-09-2025 03:31:43 PM
హైదరాబాద్: బొల్లారం రైల్వే స్టేషన్(Bolarum Railway Station) సమీపంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సేకరించి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు.