calender_icon.png 2 August, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్‌కు శిక్షణ

02-08-2025 01:58:06 AM

నిజామాబాద్ ఆగస్టు 1 (విజయ క్రాంతి): నిజామాబాద్ డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో  మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వ ర్యంలో బేటి బచావో బేటి పడావో కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్ట్ డిచ్ పల్లి ప్రాజెక్ట్ లో గల గవర్నమెంట్ పాఠశాలలు మాణిక్ బండార్,బోర్గం కె, చిన్నాపూర్, మాక్లూర్, మామిడిపల్లి, దుబ్బ, చంద్రశేఖర్ కాలనీ లోని గవర్నమెంట్ హై స్కూల్ లో గల 8,9, వ తరగతి బాలికలకు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్  ట్రైనింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.కె రసూల్ బి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి విచ్చేసి బేటి బచావో బేటి పడావో కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఆడపిల్లల ప్రాముఖ్యత, లింగ వివక్షత, ఆల్ టోల్ ఫ్రీ నెంబర్స్, తోపాటు జీవితం లో ఎదురయ్యే సమస్యలను  ఎలా ఎదుర్కోవాలి సరైన టైంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి,అనే విషయాల పైన పిల్లలకి అవగాహన కల్పించరు.

డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కు విచ్చేసిన శ్రీహరి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మహిపాల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పిల్లలకి చైల్ రైట్స్, స్కిల్స్ కెరీర్ గైడెన్స్, పబ్లిక్ స్పీకింగ్, కెపాసిటీ బిల్డింగ్, జెండర్ ఈ క్వాలిటీ, పోక్సో ఆక్ట్, పబ్లిక్ స్పీకింగ్,పర్సనాలిటీ డెవలప్మెంట్, బై స్టాండర్డ్ ఇంటర్వెన్షన్, ఓరియంటేషన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్,కెరీర్ గైడ్లైన్స్ గోల్ సెట్టింగ్స్, సాఫ్ట్ స్కిల్స్,ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్,వాటిపైన ట్రైనింగ్ ఇస్తూ వారికి అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమానికి సిడిపిఓ  శ్రీమతి సౌందర్య , శ్రీమతి జ్యోతి , సూపర్వైజర్ శ్రీ ప్రియ , వరలక్ష్మి, మమత, డాటా ప్రో డిస్టిక్ కో ఆర్డినేటర్ లహరి ఆనంద్ ,ఎక్సైజ్ ఎస్త్స్ర రవి,  స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, డిహెచ్ డబ్ల్యు టీం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, జెండర్ స్పెషలిస్ట్ సౌమ్య, కవిత ఆర్ధిక అక్షరాస్యత నిపుణురాలు పుష్ప, అకౌంటెంట్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.