calender_icon.png 1 August, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మిక్స్‌డిజైన్‌పై శిక్షణ

30-07-2025 01:16:26 AM

ఘట్ కేసర్, జూలై 29 : అనురాగ్ విశ్వవిద్యాలయంలో మంగళవారం విద్యార్థులకుఅదానీ సిమెంట్స్ సహకారంతో మిక్స్ డిజైన్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.అనురాగ్ విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ విభాగం, ఐఈఐ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరి గింది.

ఈశిక్షణా కార్యక్రమానికి అదానీ సిమెంట్స్, హైదరాబాద్ నుండి టెక్నికల్ మేనేజర్ ఇంజినీర్ కృష్ణన్ ఉన్ని నాయర్ ముఖ్య వక్తగా హాజరై మిక్స్ డిజైన్ యొక్క సిద్దాంతాలు, రంగంలో అ న్వయాలు మరియు ప్రస్తుత నిర్మాణ అవసరాలకు అనుగుణంగా అమలులో ఉన్న నూతన సాం కేతికతలపై విస్తృత సమాచారం అందించారు. విద్యార్థులు ఆయన ప్రసంగం ద్వారా ప్రాక్టికల్ అవగాహన పొందారు.ఈసందర్భంగా డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వి. విజయ్ కు మార్, శాఖాధిపతిసివిల్ ఇంజినీరింగ్ డాక్టర్ పల్లవి బద్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. హాజరత్, డాక్టర్ గుమ్మడి వెంకటరావు సమర్థవంతంగా సమ న్వయం చేశారు. సివిల్ విభాగం అధ్యాపకులు పాల్గొన్నారు.