calender_icon.png 1 November, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో డీఈ

31-10-2025 12:15:36 AM

-రూ.21 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

-డీఈ ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

-మెదక్ ట్రాన్స్‌కో కార్యాలయంలో ఘటన

మెదక్/మెదక్ టౌన్, అక్టోబర్ 30 (విజయక్రాంతి):మెదక్ విద్యుత్ శాఖ డీఈ షేక్ చాంద్ షరీఫ్ పాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తన సిబ్బందితో కలిసి గురువారం ట్రాన్స్‌కో కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.21వేలు లంచం తీసుకుంటుండగా పాషాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన రైతు పాపన్నగారి భాస్కర్ తన పౌల్ట్రీ ఫామ్‌కు సంబం ధించి25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడం కోసం డీఈ పాషా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రయించారు.

ఏసీబీ అధికారుల విచారణలో ట్రాన్స్‌ఫార్మర్ మం జూరు చేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేశాడని, అందులో భాగంగా రూ.9 వేలు ప్రైవే ట్ వ్యక్తికి ఫోన్ పే ద్వారా చెల్లించాడని తెలిపారు. మిగతా రూ.21 వేలు ఇస్తేనే ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేస్తానని డీఈ డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి నగదును గురువారం ట్రాన్స్‌కో కార్యాల యం లో తీసు కుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా డీఈ షరీఫ్ పాషా మెదక్లో అద్దెకుంటున్న ఇంటిలో, మెహిదీపట్నంలోని సొంత ఇంటిలో ఏసీబీ అధికా రులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.