20-11-2025 12:20:47 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట.నవంబర్,19(విజయక్రాంతి) : జిల్లాలోని బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ- జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా స్థానిక సంస్థ హాజరై స్ఫూర్తిదాయక అభిప్రాయంతో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గాoగ్వర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, ఎస్. డీ.సీ రాజేందర్ గౌడ్, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, డీ పీ ఆర్ వో ఎం.ఏ. రషీద్, ఇతర శాఖల జిల్లా అధికారులు, డిసిపివో కరిష్మా , చైల్ హెల్ప్ లైన్ సమన్వకర్త నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, చైల్ హెల్ప్ లైన్ సిబ్బంది, సఖి సిబ్బంది ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలన సమిష్టి బాధ్యత
నారాయణపేట టౌన్, నవంబర్ 19: మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ-జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన లోగోను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన ఛాంబర్ లో బుధవారం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు సంచిత్ గాంగ్వర్, శ్రీను, ఆర్డిఓ రామ్ చందర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, డీ పీ ఆర్ వో రషీద్, భగీరథ ఈ ఈ రంగా రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, కోస్గి తహసిల్దార్ బక్క శ్రీనివాస్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని కరిష్మా పాల్గొన్నారు.