calender_icon.png 10 August, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఫస్ట్‌లుక్ విడుదల

10-08-2025 12:50:59 AM

వడ్డే జిష్ణు సమర్పణలో ‘వడ్డే క్రియేషన్స్’ బ్యానర్ మీద వడ్ఢే నవీన్ హీరోగా, నిర్మాతగా చేస్తున్న చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు‘, కమల్ తేజ నార్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు డైరెక్టర్ తో పాటు కథ స్క్రీన్ ప్లే ను వడ్డే నవీన్ ఈ చిత్రానికి అందించడం విశేషం. ఇక ఈ మూవీలో వడ్డే నవీన్ కి జోడీగా రాసి సింగ్ నటిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ‘విజయ మాధవి కంబైన్స్’ సంస్థ కొనసాగింపుగా ‘వడ్డే క్రియేషన్స్‘ అనే బ్యానర్‌ని స్థాపించి, వడ్డే నవీన్ తండ్రి  బాటలో  పయనించాలని  నిర్ణయించుకుని  ఇకపై  ‘వడ్డే  క్రియేషన్స్ బ్యానర్‘లో  సినిమాలు రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మొదట చిత్రంగా నిర్మిస్తున్న ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయినట్లుగా సమాచారం.

తాజాగా  శనివారం రిలీజ్ చేసిన ఈ మూవీ ‘ఫస్ట్ లుక్‘ అందర్నీ ఆకట్టుకుంది. ఈ ‘ఫస్ట్ లుక్‘ పోస్టర్ ని గమనిస్తే కామెడీ యాంగిల్ కూడా వడ్డే నవీన్  ఇందులో మరింతగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవీ ప్రసాద్, సూర్య కుమార్ భగవదాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి కార్తిక్ సుజాత సాయికుమార్ కెమెరామెన్, కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకుడిగా, విజయ్ ముక్తావరపు ఎడిటర్.