10-08-2025 12:49:27 AM
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు, బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. దీన్ని పౌరాణిక ఇతివృత్తంతో ద్విభాషా చిత్రంగా దర్శక ద్వయం వెంకట్‌కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు. ఉమేశ్‌కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న కథతో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను హీరో ప్రభాస్ శుక్రవారం విడుదల చేశారు. టీజర్ విజువల్ వండర్‌గా ఉంది. దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ చిత్రబృందం ఈ టీజర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకు న్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు సుధీర్‌బాబు లుక్ అదిరిపోయింది. సోనాక్షి కలకలం సృష్టించే శక్తిగా కనిపించింది.