20-10-2025 01:38:21 AM
ఉత్తర్వులు జారీ చేసిన మేడ్చల్ కలెక్టర్
మేడ్చల్ అక్టోబర్ 19(విజయక్రాంతి): మేడ్చల్ పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట్ తహసీల్దార్ యాదగిరిరెడ్డిని కీసరకు, కలెక్టరేట్ టీ సెక్షన్ ఆఫీసర్ చంద్ర శేఖర్‌ను ఘట్‌కేసర్ తహసీల్దార్‌గా,
సీసీఎల్‌ఏ అధికారి ఉష్ణచైతన్యను మేడిపల్లి తహసీల్దార్‌గా, కీసర తహసీల్దార్ అశోక్‌కుమార్‌ను కుత్బుల్లాపూర్‌కు, కలెక్టరేట్‌లో పని చేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని కాప్రాకు, సుచరితను మూడు చింతలపల్లికి బదిలీ అయ్యారు. శామీర్‌పేట నాయబ్ తహసీల్దార్‌గా సంయుక్తకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.