calender_icon.png 20 October, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మృతి

20-10-2025 01:32:45 AM

  1. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఘటన

చిట్యాల, అక్టోబర్ 19(విజయ క్రాంతి): జాతీ య రహదారి 65 సమీపంలో కొత్తగా నిర్మించిన బంకిట్ కాఫీ కేఫ్‌లో ఆదివారం ఉదయం వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పెద్ద చెరువు వద్ద కాఫీ కేఫ్ నిర్మాణంలో పైకప్పుగా రేకులు వేసి వాటిపై వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు.

వాటర్ ట్యాంక్‌లో పూర్తిగా నీళ్లు నింపడం వల్ల రేకులు ట్యాంక్ బరువును ఆపలేక ఇంటి పైకప్పు కుప్పకూలి పోయింది. ఆదివారం కేఫ్ ప్రారంభం కానుండడంతో దాని యజమాని శివ, ఆయన కుటుంబ సభ్యులు అందులోనే నిద్రిస్తుండగా ట్యాంక్ వారి పై పడి భార్య నాగ మణి(32) కుమారుడు(6) అక్కడికక్కడే మృతిచెందగా యజమాని తల్లి, కూతుర్లకు తీవ్ర గాయాలు కావడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.