20-12-2025 01:49:32 AM
రోడ్డు విస్తరణకు అన్నారం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కృషి
తుంగతుర్తి, డిసెంబర్19: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి అన్నారం క్రాస్ రోడ్డు నుండి అన్నారం గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎజెండాలోని మొట్టమొదటి కార్యక్రమం,
రోడ్డు వెంబడి చెట్లు తొలగించి విస్తరణ కార్యక్రమం సర్పంచ్ తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు, గ్రామ ప్రజలకు సేవ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనితో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.