calender_icon.png 25 December, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెక్కింగ్‌తో ఆరోగ్యం

25-12-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పాల్వంచ, డిసెంబర్ 24, (విజయక్రాంతి): ట్రెక్కింగ్ చేయడం ద్వారా యువతలో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు ప్రకృతి పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లాలో ఏరు ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస నగర్లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గుట్టపై ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్తో పాటు ట్రైనీ కలెక్టర్ సౌరబ్ స్వయంగా పాల్గొని గుట్టపై కొంత దూరం వరకు ట్రెక్కింగ్ చేశారు. ట్రెక్కింగ్ సమయంలో పరిసర ప్రాంతాల్లోని అటవీ సంపద, సహజ ప్రకృతి అందాలను పరిశీలిస్తూ యువతతో కలిసి ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం గుట్టపై ఉన్న హిల్ వ్యూ పాయింట్ను సందర్శించి అక్కడి నుంచి పాల్వంచ పట్టణాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని సహజ దృశ్యాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై అధికారులు యువతతో చర్చించారు.అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ బాధ్యులతో వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాల్వంచ ప్రాంతంలో ఇలాంటి ప్రకృతి సౌందర్యంతో కూడిన పర్యాటక ప్రాంతాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటం గర్వకారణమని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతికి దగ్గరగా ఉల్లాసంగా గడపడానికి ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా ప్రకృతి సంరక్షణపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.

జిల్లాలో ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఏరు ఫెస్టివల్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పర్యాటక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి యం. పరంధామ రెడ్డి, తహసీల్దార్లు దుర్గాప్రసాద్, భగవాన్ రెడ్డి, ఆలయ బాధ్యులు కొత్త వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, TNGO ప్రతినిధి చైతన్య భార్గవ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్, కోచ్లు నాగేంద్ర, కల్యాణ్ (ఆర్చరీ), నబీ (రైఫిల్ షూటింగ్), రమేశ్ (టైక్వాండో), వివిధ క్రీడాకారులు, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల పాల్వంచ ప్రిన్సిపల్ అనురాధ, Pౄ శ్వేత, విద్యార్థులు, NCC, NSS వాలంటీర్లు, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అంబరాన్నంటిన నవ భారత్ క్రీడా వార్షిక సంబురం

పాల్వంచ, డిసెంబర్ 24, (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ పబ్లిక్ పాఠశాల 46వ వార్షిక క్రీడా దినోత్సవ సంబరాలు బుధవారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. వి. పాటిల్, గౌరవ అతిథి గా ch.కాంతారావు పిడి గ్రేడ్ 2నేషనల్ వాలీబాల్ రిఫరీ, పాఠశాల కరెస్పాండెనట టీ . సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ N.V.K. ప్రసాద్  స్వాగతోపన్యాసం చేశారు.

నవ భరత్ పాఠశాల విద్యార్థులు ఈ విద్య సంవత్సరం వివిధ క్రీడలలో జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభను కనబరిచారన్నారు. అనంతరం అతిధులు పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మార్చి ఫాస్ట్ కవాతుని తిలకించి గౌరవ వందనం స్వీకరించారు . ఈ విద్యా సంవత్సరం క్రీడాజ్యోతిని వెలిగించే గౌరవాన్ని బండారి శ్రీ నాగ చైతన్య దక్కించుకున్నాడు. అనంతరం విద్యార్థులకు అథ్లెటిక్స్ ట్రాక్ పై 17క్రీడా అంశాల్లో పోటీలను క్రీడా శిక్షకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ చిన్నారులు ప్రదర్శించినదేశ భక్తి.క్రీడా నృత్యము, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఆకృతులు గల పిరమిడ్లు, వ్యాయామం వల్ల శరీరధారుడ్యం పెంపొందించు కోవచ్చునని తెలిపే నృత్యం, ప్రపంచ శాంతిని ప్రబోధించే నృత్యము ప్రదర్శకులను ఆలోచింపచేసాయి. పాఠశాల వ్యాయామ శిక్షకులు శ్రీమతి ఎన్. లక్ష్మిగారు వార్షిక నివేదికను సమ ర్పించారు. అనంతరం విజేతలకు ముఖ్య అతిధులు చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవ భరత్ పాఠశాల లోగో ఐన శ్రధ్వనే లభత్ జ్ఞానం అనేదే అత్యంత స్ఫూర్తి దాయకం అని, జ్ఞానం తోనే జీవితం లో రాణించగలం అని, విద్యార్థి దశ లో క్రీడలు శారీరికంగా, మానసికంగా ఆరోగ్యంనీ పెంపొందిస్తా యన్నారు. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తిల కన్న ఆదర్శనీయం అని కొనియాడారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలలో గెలిచిన విజేత లకు బహుమతులను అందజేశారు.