calender_icon.png 18 February, 2026 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరగాళ్ల గుండెల్లో వణుకు

18-02-2026 12:00:00 AM

  1. విధుల్లోకి 76 పోలీస్ జాగిలాలు 
  2. మొయినాబాద్ ఐఐటీఏలో ఘనంగా జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

రంగారెడ్డి /మొయినాబాద్ ఫిబ్రవరి 17( విజయక్రాంతి): నేర పరిశోధనలో పోలీసులకు కుడిభుజంలా నిలిచే పోలీస్ జాగిలాలు విధుల్లోకి చేరాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనిం గ్ అకాడమీ (IITA) వేదికగా మంగళవారం 25వ బ్యాచ్ పోలీస్ జాగిలాలు, వాటి హ్యాం డ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్ అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఎనిమిది నెలల పా టు సాగిన కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్న 76 జాగిలాలు, 105 మంది హ్యాండ్లర్లు ఇప్పుడు విధులకు సన్నద్ధమయ్యారు. మొ త్తం 76 జాగిలాల్లో తెలంగాణకు చెందినవి 42 ఉండగా, బీహార్ సీఐడీకి చెందినవి 30, సీఐఎస్‌ఎఫ్ (CISF)కు చెందినవి 4 ఉన్నా యి.

ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘జాగిలాలు కేవలం జంతువులు మాత్రమే కాదు, పోలీసుల అత్యంత క్రమశిక్షణ గల భాగస్వాములని ప్రశంసలు కురిపించారు. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను గుర్తించడంలోనూ, రెస్క్యూ ఆపరేషన్లలోనూ వీటి పాత్ర కీలకం‘ అని కొనియాడారు. 2004లో ప్రారంభమైన ఈ అకాడమీ ఇప్పటివరకు 919 జాగిలాలు, 1310 మంది హ్యాండ్లర్లకు శిక్షణ ఇచ్చి దేశంలోనే అత్యుత్తమ సంస్థగా గుర్తింపు పొందిందని ఓఎస్డీ శ్రీ వి.బి. కమలాసన్ రెడ్డి తెలిపారు.

ప్రతిభ కనబరిచిన విజేతలు..

శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన హ్యాండ్లర్లు, జాగిలాలకు పురస్కారాలు అందజేశారు. ఎక్స్పో్లజివ్ విభాగం లో వి. భాస్కర రావు (జాగిలం: లియో -సీఐఎస్‌ఎఫ్), నార్కోటిక్ విభాగంలో సుదర్శన్ కుమార్ (జాగి లం: చార్లీ - బీహార్ సీఐడీ), ట్రాకర్ విభాగం లో ఎం.శ్రీనాథ్ (జాగిలం: రాకీ - రామగుండం), ఫిజికల్ పెర్ఫార్మెన్స్ విభాగంలో బి. నితిన్ (కరీంనగర్) మొదటి స్థానంలో నిలిచారు.

జాగిలాల ఆరోగ్యం మరియు శిక్షణ కోసం అకాడమీలో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ‘కెనైన్ ఆల్ఫాక్షన్ పార్క్’, అత్యాధునిక వెటర్నరీ ఆస్పత్రి సేవలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. వరుసగా రెండు ఏళ్లు ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లలో తెలంగాణ పోలీస్ విభాగం పతకాలు సాధించడం ఇక్కడి శిక్షణకు నిదర్శన మని గర్వంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఐజిపి శ్రీ కార్తికేయ, ఎస్పీలు అపూర్వరావు, కరుణాకర్, చక్రవర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.