16 June, 2026 | 2:43 AM

ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

16-06-2026 01:54 AM

తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

మధిర, జూన్ 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ సామినేని సుజాత స్వయంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత మాట్లాడుతూ... మధిరను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అని అన్నారు.

భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధిరలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, నిరంతర తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పనులను వేగవంతం చేశారు అని తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందేలా భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.  మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు  పాల్గొని రక్తదానం చేశారు.