15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కరెంట్ షాక్‌తో కేబుల్ ఆపరేటర్ మృతి

10-02-2026 12:00 AM

కారేపల్లి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కరెంటు షాక్ తో సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇల్లెందులో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి రజక బజారుకు చెందిన జూపల్లి లాలయ్య(41) ఇల్లెందు మండలంలో కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉంటాడు.

ఇల్లందు కరెంట్ ఆఫీస్ సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారి పక్కన డిష్ కేబుల్ విద్యుత్ స్తంభాల పై నుండి లాగే క్రమంలో కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మతుడు లాలయ్యకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఇల్లెందు పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.