calender_icon.png 19 November, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళి

24-07-2024 01:34:40 AM

  • జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 
  • పాదయాత్రగా అసెంబ్లీకి.. 

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళుల్పరించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం గన్‌పార్కు నుంచి అసెంబ్లీలోకి పాదయాత్రగా వెళ్లారు.

అమరవీరులకు నివాళులర్పిం చిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ముఠాగోపాల్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేపీ వివేకానంద్‌గౌడ్, కాలేరు వెంకటేశ్, గంగుల కమలాకర్, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాద వ్, మల్లారెడ్డి, చింతా ప్రభాకర్ ఉన్నారు.

పదవీకాలం ముగిసినా బిల్లు  రాలేదు

రాష్ట్రంలో సర్పంచుల కాలం ముగిసి ౭నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు.  వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.