calender_icon.png 7 August, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి

07-08-2025 12:17:03 AM

మేడ్చల్, ఆగస్టు 06(విజయ క్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ మిక్కిలి నేని మను చౌదరి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయశంకర్ 91వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరు డు, ప్రతి ఉద్యోగి జయశంకర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, బీ సీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ రాణి, ఏవో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నా గారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భాస్కర్ రెడ్డి, జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్ రెడ్డి, ఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

యాచారం ఆగస్టు 06: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవా రం తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ 91వ జ యంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాధారాణి  ప్రొ ఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీలత సూపరిండెంట్ శైలజ, తదితరులుపాల్గొన్నారు.

చేవెళ్ల, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు యాది చేసుకున్నారు. బుధవారం ఆయన జయంతి సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో సార్ విగ్రహానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు విశ్వక్మ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవర సమత వెంకట్రెడ్డి, తదితరులున్నారు.