calender_icon.png 7 August, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వాలని ధర్నా

07-08-2025 12:16:42 AM

సీపీఐ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన

* అనుమతులు ఇచ్చే వరకు పోరాడుతాం  

కొండాపూర్, ఆగస్టు 6:  ఇండ్ల స్థలాల పొజిషన్ కలిగి పట్టా సర్టిఫికెట్లు ఉన్న వారికి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని గంగారం పంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పంచాయతీ ఆఫీస్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పట్టాలిచ్చి, పొజిషన్ చూపెట్టి రెండేళ్ళవుతున్నా ఎందుకు ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

పర్మిషన్లు ఇచ్చేంతవరకు ఆందోళన విరమించమని అనడంతో పంచాయతీ కార్యదర్శి తహసిల్దార్ తో ఫోన్లో మాట్లాడారు. ఇండ్ల స్థలాల పట్టాలు ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామని, ఆగస్టు 15 తర్వాత తహసీల్దారు వచ్చి పరిశీలిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ గంగారం గ్రామంలోని సర్వే నెంబర్ 1, 5, 243లో గల ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు సుమారు 100 మందికి రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు  ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి పొజిషన్ చూపెట్టారని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వాలని కోరగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

ఈ గ్రామంలోని  మూడుసార్లు ఇండ్ల స్థలాలు పట్టాలి ఇచ్చి వాటి కాలపరిమితి అయిపోయిందనే సాకుతో పట్టాలను రద్దుచేస్తూ నిరుపేద ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పట్టాలున్న వారందరికీ ఇండ్ల నిర్మాణం కోసం పర్మిషన్లు వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే.రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, ప్రవీణ్, గ్రామస్థాయి నాయకులు సాల్మన్, ప్రశాంత్, గ్రామస్తులు ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.