25-11-2025 12:00:00 AM
సూర్యం మృతి పట్ల ఎమ్మెల్యే పాయం దిగ్భ్రాంతి
మణుగూరు, నవంబర్ 24, (విజయక్రాంతి) : అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బండ్ల సూర్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన అకాల మరణం పట్ల పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేతగా సూర్యం తనకు చిరకాల మిత్రుడని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక మూల స్తంభం లాంటి వారని అభివర్ణించారు.
అతని జీవితకాలం కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి, కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి తన జీవితం కృషి చేశారని పేర్కొన్నారు. అతని మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు తెలిపారు. అతని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సూర్యం మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామా శ్రీనివా సరెడ్డి, పోలమూరు రాజు, గణేష్ రెడ్డి, మండల నాయకులు గాండ్ల సురేష్, బత్తుల శ్రీనివాస్, డాక్టర్ కళ్యాణ్, మహిళా నాయకురాలు బత్తుల సుజాత, మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె రహీం పాషా ఆయన స్వగ్రామమైన అన్నారం చేరుకొని ఆయన పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు.సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఆయనకు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతిచెందిన విషయం తెలుసుకున్న వెంటనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన భౌతిక దేహా న్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో వారికున్న అనుబంధాలను పలువురుతో పంచుకున్నారు.