calender_icon.png 25 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన విద్యతోనే మార్పు

25-11-2025 12:00:00 AM

  1. నైతిక విద్యకు మార్గదర్శకుడు బ్రహ్మశ్రీ చాగంటి 
  2. క్యాబినేట్ ర్యాంకు వ్యక్తి అయినా.. ప్రభుత్వ సౌకర్యాలకు దూరం
  3. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): విలువలతో కూడిన విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని, ఆర్థికాభివృద్ధితోపాటు, విలువలతో నడిచే సమాజా న్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ర్ట స్థాయి నైతిక విద్యా సదస్సు ‘మోరల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్’లో ఆయన మాట్లాడారు.

విలువల ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని సీఎం చంద్రబాబు తనకు బాధ్యత అప్పజెప్పారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో విలువ పెంపొందించే ఉద్దేశంతోనే మోరల్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి మార్గదర్శకుడిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్ ర్యాంకుతో నియ మించామని స్పష్టం చేశారు. ప్రభు త్వం తరఫు నుంచి అనేక సౌకర్యాలు కల్పించినా చాగంటి వినియోగించుకోవ డం లేదని వెల్లడించారు.

ప్రభుత్వ వా హనం వాడటం లేదు, ప్రభుత్వ డబ్బు తో కాఫీ కూడా తాగరని, సొంతంగా ఫోన్ బిల్లు చెల్లించుకోవడంతోపాటు ఏ ప్రభుత్వ సౌకర్యమూ తీసుకోవడం లేదని కొనియాడారు. ‘అలాంటి నిజాయితీ ఉన్న వ్యక్తి మార్గనిర్దేశంతో తాము విద్యార్థుల కోసం ‘మోరల్ వాల్యూస్’ పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.