calender_icon.png 11 August, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత వృద్ధితో కలవరంలో ట్రంప్

11-08-2025 01:35:52 AM

- భారత అభివృద్ధిని చూసి చాలా మందికి అసూయ 

- కుంటుపడేలా చేసేందుకు ప్రయత్నాలు 

- కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

భోపాల్, ఆగస్టు 10: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గ్రీన్‌ఫీల్డ్ రైల్ కోచ్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘భారతదేశ అ భివృద్ధిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించలేకపోతున్నారు. ప్రపంచంలోని చా లా శక్తులు భారతదేశ వేగవంతమైన అభివృద్ధిని చూసి అసూయపడుతున్నాయి. “సబ్ కా బాస్ తో హం హయ్‌” (అందరికీ మేమే బాస్) అనే వాళ్లకు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న భారత వృద్ధి రుచించడం లేదు.

భా రత్ సూపర్ పవర్‌గా మారకుండా ఎవరూ ఆపలేరు. భారత పురోగతిని అంగీకరించక పోతున్నారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినపుడు వా టిని మరింత ఖరీదైనవిగా చేసేందుకు ఇప్పు డు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు. భారత్‌పై ఇటీవల 50శాతం మేర సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తప్పుబడుతూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ప్ర యత్నాలు చేసినా, సుంకాలు వేసినా కానీ భారత అభివృద్ధిని ఆపలేరన్నారు. 

అతి త్వరలోనే సూపర్ పవర్‌గా.. 

భారత్ అతిత్వరలోనే ప్రపంచంలో మూ డో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భా రత ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం మోదీ ప్రభు త్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. మేకిన్ ఇండియా వల్ల వివిధ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. భారత రక్షణ ఎగు మతులు రూ. 24 వేల కోట్లు దాటాయి. ఇవ న్నీ రక్షణ రంగ బలాన్ని, అభివృద్ధిని సూచిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ను ఉద్దే శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.